హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా… వరుసగా సినిమాలు చేస్తున్న హీరో నితిన్. ఒక్క నెలలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ మ్యాస్ట్రోగా రాబోతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా నితిన్ నెక్ట్స్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో నితిన్ బ్లైండ్ గా కనిపించనున్నాడు. రక్తపు మరకలు ఉన్న పియానోపై స్టిక్ సహయంతో నితిన్ పార్టీ వేర్ డ్రెస్ లో ఉన్న పిక్ చూస్తే… క్రైం థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది.
ఈ మూవీలో తమన్నా ఓ క్రూషియల్ రోల్ చేస్తుండగా… నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తుండగా… మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.