గత ఏడాది భీష్మ సినిమాతో హిట్ ని అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం చెక్, రంగ్ దే, అంధుధాన్ రీమేక్ లలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 19న చెక్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే రంగ్ దే సినిమా ముందు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు.
కానీ ఇప్పుడు చెక్ రాబోతుంది. కాగా రంగ్ దే కూడా పెద్ద గ్యాప్ తీసుకోవడం లేదు. మార్చి నెలలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అంటే నితిన్ రెండు నెలల వ్యవధిలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడన్నమాట.