నిత్య మీనన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. మలయాళ కుట్టి నిత్యామీనన్ తెలుగులో వరుసగా ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది నిత్యా మీనన్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి.
ఇష్క్ సినిమాతో కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ గా మారిన తర్వాత జనతా గ్యారేజ్, అ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, స్కైలాబ్ సినిమాలతో నిత్య అలరించింది. గతేడాది పవర్ స్టార్ పవన్ సరసన భీమ్లా నాయక్ మూవీతో మరో హిట్ అందుకుంది. ఇక మోడ్రన్ లవ్ హైదరాబాద్ సిరీస్ ప్రమోషన్స్ లో కనిపించిన నిత్యా.. నడవలేని స్థితిలో చేతిలో స్టిక్ పట్టుకుని కనిపించి షాకిచ్చింది. చేతిలో స్టిక్ పట్టుకుని రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె నడవలేని స్థితిలో ఇద్దరు బాడీ గార్డ్స్ సాయంతో వచ్చింది.
హైదరాబాద్ లో జరిగిన మోడ్రన్ లవ్ హైదరాబాద్ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ కి అందులో నటించిన ఆర్టిస్టులంతా హాజరయ్యారు. అయితే ఈవెంట్లో నిత్యమీనన్ ఒక స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సహాయంతో నడుచుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళింది. అలా చూసి అందరూ ఒక్కసారిగా కంగారుపడ్డారు. నిత్యామీనన్ కి ఏమైంది అంటూ ఆందోళన చెందారు.
వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ లాంచ్ వేడుకకు హాజరైన జర్నలిస్టులు.. నిత్య మీనన్ ను ప్రశ్నించడంతో తనకు గాయాలయ్యాయని చెప్పారు. మెట్లు దిగుతూ కింద పడటంతో మోకాలికి గాయమైనట్లు తెలిపింది. నడవలేని పరిస్థితుల్లో కూడా నిత్యమీనన్ తాను నటించిన సిరీస్ ప్రమోషన్ లో పాల్గొనడం చూసి ప్రతి ఒక్కరు ఆమె డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. అంతేకాదు నిత్యామీనన్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సైతం ఆశిస్తున్నారు.
Advertisements
ఇలా ఒక వైపు సినిమాలు.. మరో వైపు వెబ్ సీరీస్లు.. ఇంకొకవైపు షోలు చేస్తూ బిజీబిజీగా తన జీవితాన్ని గడుపుతుంది నిత్యామీనన్. ఇకపోతే తాజాగా నిత్యామీనన్ నటించిన వెబ్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ జూలై 8వ తేదీ నుంచి అమెజాన్ లో టెలికాస్ట్ కానుంది.