జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీతి ఆయోగ్ కార్యదర్శి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
శుక్రవారం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు అర్చకులు సంజయ్ కుమార్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు.