టాలీవుడ్ లో కొందరు దర్శకులకు మంచి ఇమేజ్ ఉంది. ఆ దర్శకులు సాహసాలు చేయడంతో పాటుగా కొత్త వారిని పరిచయం చేస్తూ ఉంటారు. ఈ జాబితాలో దర్శకుడు తేజ ఒకరు. ఉదయ్ కిరణ్, నితిన్ వంటి హీరోల కెరీర్ కి మంచి పునాది వేసాడు. ఇక ఇప్పుడు అభిరాం తో అహింస అనే సినిమా చేస్తున్నాడు. నితిన్ ను సదాని జయం సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేసాడు తేజ.
ఇక ఉదయ్ కిరణ్ ను చిత్రం సినిమాతో పరిచయం చేసాడు. ఈ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇక మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన నిజం సినిమాను కూడా తేజ డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమాల తర్వాత తేజ… ధైర్యం అనే టైటిల్ తో నితిన్ ను హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమాకు నిర్మాతగా నితిన్ తండ్రి ఉన్నారు. అయితే కొంత షూట్ అయిన తర్వాత సినిమా రీ షూట్ చేయాలని తేజా కోరారు.
అనుకున్న విధంగా సినిమా రాలేదని షూట్ చేద్దామని అడిగారట. కాని అందుకు నితిన్ తండ్రి నో అన్నారు. ఇక సినిమాను అలాగే పూర్తి చేసారు. కోపం తో తేజా సినిమా కొనడానికి వచ్చిన వాళ్ళ దగ్గర సినిమా బాలేదని చెప్పారట. దీనితో నితిన్ కు తేజ కు మధ్య గొడవ కూడా అయింది. అప్పటి నుంచి ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఇప్పటికి కూడా ఇద్దరి మధ్య మాటలు లేవు.