బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్టుగానే జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఈ నెల 16 న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు సాయంత్రానికల్లా బీజేపీ పెద్దలు బిహార్ చేరుకుని ప్రభుత్వం ఏర్పాటుపై నితీష్ కుమార్‌తో చర్చలు జరుపనున్నారు. కాగా బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం ఇది ఏడోసారి.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ 243 సీట్లలో పోటీ చేసి 125 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో బీజేపీకి 74 సీట్లు, జేడీయూ 43 సీట్లు వచ్చాయి. మొత్తంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది.మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసిన మహా కూటమికి 110 సీట్లు వచ్చాయి.