వరకట్నంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వరకట్నం తీసుకోవడం కన్నా దారుణం మరొకటి లేదని ఆయన అన్నారు.
పాట్నాలో గర్ల్స్ హాస్టల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తాము కాలేజీ చదివే రోజుల్లో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమ్మాయిలు చాలా తక్కువగా ఉండే వారని తెలిపారు.
అది చాలా బాధాకరమైన విషయం అన్నారు. కోర్సులో ఒక అమ్మాయి జాయిన్ అయిందంటే చాలు అందరూ ఆమె వైపే చూసేవారని చెప్పారు. కానీ ఇప్పుడు కాలం మారిందన్నారు.
ప్రస్తుతం ఎక్కువ మంది యువతులు మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారని తెలిపారు. మహిళల కోరిక మేరకే తమ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు.
వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఎన్నో క్యాంపెయిన్లు నిర్వహించిందన్నారు. వరకట్నం తీసుకోవడం కన్నా దారుణమైనది మరోటి లేదన్నారు.
వివాహం చేసుకుంటేనే పిల్లలు పుడతారు. ఒక మగాడు మరో మగాడిని వివాహం చేసుకుంటే పిల్లలు పుడతారా అని ప్రశ్నించాడు. వరకట్నం తీసుకోవడం లేదని డిక్లరేషన్ చేస్తేనే తాను ఆ పెళ్లిళ్లకు హాజరవుతానని ఇది వరకు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.