నివర్ అతి తీవ్ర తుపానుగా మారింది. తమిళనాడు, పాండిచ్చేరి వైపు దూసుకొస్తోంది. గంట గంటకు మరింత బలపడుతూ తీవ్రంగా మారుతోంది. వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం నేటి సాయంత్రం కరైకల్, మామళ్లపురం మధ్య తీరాన్ని తాకనుంది. ఆ సమయంలో గంటకు 120-145 కి.మీ.ల వేగంతో గాలుల ఉధృతి ఉంటుందని వారు చెప్తున్నారు.
నివర్ తుపాన్‌తో రేపు, ఎల్లుండి.. తమిళనాడు, పాండిచ్చేరిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ఆగ్నేయ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి 27వ తేదీ వరకు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడిచింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి.