దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం ఈ మూవీలో హీరోయిన్స్ కు మంచి ప్రాధాన్యత ఉందని ముందు నుండి ప్రచారం సాగుతుంది. రానా సరసన సాయి పల్లవి నటిస్తుండగా, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహబ్ కూడా మూవీలో మెరుస్తున్నారు.
ఇప్పుడు ఈ మూవీలో కీలకమైన పాత్ర కోసం నివేదా పేతురాజ్‌ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లోనే… నివేదా సెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అభ్యుదయ భావాలు, నక్సలిజం, ప్రేమ మధ్య సాగే కథ కావటంతో ఫెమినిజం తరహా కథగా ప్రచారం సాగుతుంది. సినిమాలో ఆయా పాత్రల్లో పేరున్న నటీనటులను ఎంపిక చేసుకుంటేనే సినిమా వెయిట్ మరింత పెరుగుతుందన్న ఉద్దేశంతో నిర్మాత సురేష్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది.