ప్రాధాన్యత ఉన్న సినినిమాలనే ఎంచుకుంటోంది నివేదా థామస్. అంతే కాదు ఎక్కువగా తెలుగు సినిమాలకే ప్రయారిటీ ఇస్తోంది నివేదా. అయితే చిన్న మాట. దీంతో సొంత భాష మలయాళంలో లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మలయాళంలో రీఎంట్రీ ఇస్తోంది.
‘ఎంతడ సాజి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కుంచకో బోబన్, జయరామ్ హీరోలుగా నటిస్తున్నారు.ఇదొక ఫన్ ఎంటర్టైనర్. ఏడేళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించడం ఓ విశేషమైతే.. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత నివేద మళ్లీ మలయాళ సినిమాలో నటిస్తుండటం మరో విశేషం.
2014లో వచ్చిన ‘మణిరత్నం’ అనే సినిమా తర్వాత టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి, మాలీవుడ్‌కు దూరమైంది నివేద. మళ్లీ ఇన్నేళ్లకు మాతృభాషలో నటిస్తున్న ఆమె, మరోవైపు ఓ తెలుగు సినిమాలోనూ నటిస్తోంది. ఆ సినిమా ఏమిటనేది చెప్పనప్పటికీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నివేదా థామస్.