మరో మూడు టెర్ములు నేనే సీయంగా వుంటాను. కేటీఆర్‌కు సీయం పదవి ఎందుకిస్తాను.. అంటూ మొన్న టీఆర్ఎస్ నేత కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దీనిపై మాట్లాడారు.
నిజామాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బొందపెడతామని.. అది చూడటానికి కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆకాంక్షించారు. కరీంనగర్ దొరలు, ల్యాండ్ మాఫియా కోసమే భూప్రక్షాళన చేస్తున్నారని విమర్శించారు. చిదంబరానికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని ఎంపీ అరవింద్ జోస్యం చెప్పారు. ఎంఐఎం పార్టీకి కేసీఆర్ చెంచాలా మారారని ఎంపీ టీఆరోపించారు.