ఒకవైపు కరోనా తో జనాలు పార్టీలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం పిలుపునిస్తూనే, మరోవైపు హైదరాబాద్ శామీర్ పేట్ లోని ఓ రిసార్ట్ లో నిజామాబాద్ అధికార టీఆరెఎస్ నాయకులే మందుతో చిందేశారు. మార్చ్ 31 వరకు అన్నీ బంద్ చేస్తున్నామని, స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.
కానీ ఈ రిసార్ట్ లో జరిగిన పార్టీలో నిజామాబాద్ కు చెందిన టీఆరెఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ పార్టీ కెసిఆర్ కూతురు కవిత ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ టీఆరెఎస్ నాయకులకు ఇచ్చిన పార్టీ అని వార్తలు వస్తున్నాయి.
కరోనా తో జనం ఇబ్బందులు పడుతుంటే,బాధ్యత గల పదవుల్లో ఉన్న మీరే పార్టీలు అంటూ , ప్రజలకు ఏలాంటి సందేశం ఇస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.