గత సంవత్సరం ఇదే టైమ్ లో, “బిగ్ బాస్ తెలుగు” OTT వెర్షన్ హెడ్ లైన్స్ లో నిలిచింది. నాగార్జున అక్కినేని “బిగ్ బాస్ నాన్‌స్టాప్” పేరుతో మొదటి ఓటీటీ వెర్షన్‌ను హోస్ట్ చేశాడు. అందులో బిందు మాధవి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే రెండో సీజన్‌ను స్టార్ మా ఛానెల్ రద్దు చేసింది.
బుల్లితెరపై బిగ్ బాస్ 6 ఆరో సీజన్ ఫ్లాప్ అయింది. ఈ రియాల్టీ షో తన మెరుపును కోల్పోయింది. వీక్షకుల్ని ఆకర్షించడంలో విఫలమైంది. ఈ విషయాన్ని మాటీవీ యాజమాన్యం గుర్తించింది. ఫలితంగా, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ రెండవ సీజన్‌ను పునరుద్ధరించకూడదని ఛానెల్ నిర్ణయించుకుంది.
ఇకపై నాగార్జునను ఈ కార్యక్రమానికి కేటాయించడం లేదు. గత సంవత్సరం, టీవీ వెర్షన్, ఓటీటీ వెర్షన్ల నుంచి రూ. 20 కోట్లకు పైగా సంపాదించాడు నాగ్. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క షో మాత్రమే చేశాడు. అలా నాగ్ వేతనంలో భారీగా కోత పడింది.
మరోవైపు నాగార్జున తన యాక్టింగ్ కెరీర్‌పై దృష్టి సారించాడు. బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.