పొన్నియిన్ సెల్వన్ 2 విషయంలో ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదని తెలుస్తోంది. ఏప్రిల్ 28వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు తమిళంలో తప్ప..మిగతా భాషల్లో ఈ చిత్రానికి సరిగ్గా బిజినెస్ జరగట్లేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పీఎస్ 2 హక్కుల్ని కొనేందుకు ఇంత వరకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం.
దీంతో మణిరత్నంని రంగంలోకి దింపి, బయ్యర్స్‌ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. అప్పటికీ హక్కులు అమ్ముడుపోకపోతే..ఓన్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అటు..బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం పై ఏ మాత్రం హైప్ లేదు. ఇందుకు..పీఎస్1 ఇతర రాష్ట్రాల ఆడియెన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోవడమే కారణం.
చెప్పుకోవడానికి పీఎస్ 1 రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టగలిగింది. కానీ ఇతర రాష్ట్రాల్లో అంతగా ఆదరణ పొందలేకపోయింది. ఇదో హిస్టారికల్ సినిమా అయినప్పటికీ..తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించిందని, ఈ సినిమా పెద్దగా సినిమాటిక్ అనుభూతి ఇవ్వలేదని కామెంట్లు వినిపించాయి. క్రిటిక్స్ కూడా తొలి భాగానికి ఆశాజనకమైన రివ్యూలు ఇవ్వలేదు.
అందుకే..రిలీజ్ దగ్గరపడుతున్నా, పీఎస్ 2 కి పెద్దగా క్రేజ్ ఏర్పడటం లేదని తెలుస్తోంది. కాగా తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాల్లో రూపొందింది. ఇందులో కార్తీ, విక్రమ్, జయం రవి, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్య రాయ్, త్రిషా, మొదలైన స్టార్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.