ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడటంతో క్రికెట్ లవర్స్ ఆప్సేట్ అయ్యారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి జరగాల్సిన ఐపీఎల్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడటంతో. . తిరిగి ఐపీఎల్ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అప్పుడే చర్చలు మొదలెట్టేశారు. ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ వాయిదా పడితే బీసీసీఐకు వేల కోట్ల నష్టం వచ్చే చాన్స్ ఉండటంతో… ఈ నష్టాల నుంచి బయటపడేందుకు బీసీసీఐ కొత్త ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి అక్టోబర్, నవంబర్ నెలలో టీ-20 ప్రపంచ కప్ నిర్వహించాల్సి ఉంది. ఇందుకు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. అయితే ప్రస్తుతం కరోనా ఆస్ట్రేలియాపై విరుచుకుపడుతుండటంతో అక్కడ టీ-20 ప్రపంచ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావంతో ఆరునెలలపాటు లాక్ డౌన్ కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ-20 ప్రపంచ కప్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో..దానిని బీసీసీఐ తనకు అనుకూలంగా మార్చుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో ఐపీఎల్ లీగ్ మొతాన్ని లేక మినీ ఐపీఎల్ ను నిర్వహించాలనే ఆలోచన చేస్తుందని సమాచారం. ఇక, అక్టోబర్ నాటికి కుడా పరిస్థితులు సద్దుమనుగుతాయని.. ఆ సమయంలోనే ఐపీఎల్ ను నిర్వహించడం సేఫ్ అని అంటున్నారు.కాగా,అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే చెప్పలేం. అక్టోబర్,నవంబర్ నాటికి ఇతర దేశాలలో కరోనా ప్రభావం ఉంటే స్వదేశీ ఆటగాళ్ళతోనే ఐపీఎల్ ను నిర్వహించే విషయమై బీసీసీఐ సమాలోచనలు జరపనుంది. అయితే టీ-20 ప్రపంచ కప్ వాయిదా పడటం లేదా రద్దు అయితేనే అక్టోబర్ లేదా నవమార్ మాసాల్లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం అవుతుంది.