యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. నారాయణపురంలో మిషన్ భగీరథ పనులు చేస్తున్న సందీప్ అనే కార్మికుడికి విద్యుత్ షాక్ తగలటంతో… ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం, వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే… డీజీల్ లేదనే సాకుతో బాధితున్ని 108 సిబ్బంది మార్గం మధ్యలోనే దింపేశారు. దీంతో… చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో సందీప్ నరకయాతన అనుభవించాడు. చివరకు ప్రైవేటు అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కు తరలించారు.