వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. మున్సిపాలిటీల్లోని వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు, వారసత్వ బదిలీ, హక్కుల బదిలీ జరుగాలంటే నోడ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంటే ఇంటిపన్ను, నల్లా, విద్యుత్ వంటి బిల్లులన్నీ రిజిస్ట్రేషన్ కంటే ముందుగా క్లియర్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఆయా బిల్లులన్నీ చెల్లిస్తేనే.. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్‌ను అధికారులు జారీ చేస్తారు. ఇందుకోసం సంబంధింత భూమి, హక్కుదారు మున్సిపాలిటీకి రాతపూర్వకంగా, సంబంధిత పన్నుల బిల్లుల రసీదులను పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన అనంతరం నాలుగురోజుల్లోగా నోడ్యూస్ సర్టిఫికెట్ జారీచేస్తారు. దాని ఆధారంగానే మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా జారీ చేసింది.