తాలిబన్ల ప్రభుత్వం అనగానే ఆప్ఘన్ లో మహిళలు ఎందుకంత భయపడ్డారో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. గతంలో తాలిబన్ ప్రభుత్వ ఉన్న సమయంలో కేవలం అబ్బాయిలకే చదవులు, మగవారికే ఉద్యోగాలు. కానీ ఇప్పుడు మళ్లీ అదే రోజులు వచ్చేలా ఉన్నాయి.
మహిళా ఉద్యోగులకు డిపార్ట్మెంట్ల వారీగా ఇంటికే పరిమితం చేస్తున్న తాలిబన్ల సర్కార్… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6-12వ తరగతుల విద్యార్థులను మాత్రమే స్కూల్స్ కు రావాలని, పురుష ఉపాధ్యాయులే స్కూల్ వచ్చి బోధన చేయాలని ఆదేశించింది. దీంతో ఆ తరగతుల విద్యార్థినులకు చదవులు లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇటీవల 1-5వ తరగతి వరకు అందర్నీ స్కూల్స్ కు రావాలని ఆదేశించి, ఇప్పుడు మాత్రం కేవలం అబ్బాయిలను మాత్రమే రావాలని చెప్పటం అంటే అంతరార్థం అదేనని స్పష్టం అవుతుంది.