కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చట్టాలను రద్దు చేస్తూ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించినా మద్దతు ధర కోసం పోరు సాగిస్తామని ప్రకటించారు. అయితే మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా 700 మందికి పైగా రైతులు చనిపోయారని ఆయా సంఘాల లెక్కలు చెబుతున్నాయి. అయితే దీనిపై తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది.
రైతుల మరణాలపై తమ దగ్గర సమాచారం లేదని వెల్లడించింది కేంద్రం. కేసుల ఉపసంహరణ, ఆర్థిక సాయం వంటి అంశంపై పార్లమెంట్‌లో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం చెప్పారు. ప్రభుత్వం దగ్గర తగిన సమాచారం లేదన్నారు. అలాంటప్పుడు సాయం అనే దానికి తావే లేదని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇది రైతులకు జరిగిన అవమానం అని అన్నారు.