ప్రపంచ టాప్ 10 ధనవంతుల్లో ఒకరు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ ఆదానీ గురించి ఓ వార్త ఇటీవల వైరల్ అవుతోంది. ఆయన లేదా ఆయన భార్య ప్రీతీ ఆదానీ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయనను లేదా ఆయన భార్యను రాజ్యసభకు ఓ పార్టీ నామినెట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై అదానీ గ్రూప్ క్లారిటీ ఇచ్చింది. ఆదానీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రాబోరని స్పష్టం కుండ బద్దలు కొట్టేసింది. వారి కుటుంబానికి రాజకీయం పట్ల ఎలాంటి ఆసక్తి లేదని గ్రూపు వెల్లడించింది.
‘ ఆదానీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు మా దృష్టికి వచ్చాయి. అందులో ఏ మాత్రం నిజం లేదు. కొందరు రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ఆదానీ కుటుంబ సభ్యుల పేర్లను వాడుకుంటున్నారు. గౌతమ్ ఆదానీ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏ పార్టీలో చేరడం లేదు’ అని ఆదానీ గ్రూప్ స్పష్టం చేసింది.