మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఎలాంటి అంతర్గత అశాంతి లేదని మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్దవ్ థాక్రే అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చాలనుకునే వాళ్లకు అభివృద్ధితోనే సరైన సమాధానం చెబుతున్నామని ఆయన తెలిపారు.
సెంట్రల్ ముంబైలోని వాదలాలో జీఎస్టీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన వర్చువల్ గా మాట్లాడుతూ… దేశ ఆర్థిక వ్యవస్థకు మహారాష్ట్ర పెద్ద సహకారి అన్న విషయాన్ని మహారాష్ట్రకు హాని కలిగిస్తున్న వారు గుర్తించుకోవాలన్నారు.
మహావికాస్ అగాఢీ ప్రభుత్వంలో ఎలాంటి అంతర్గత అశాంతి లేదన్నారు. ఈ ప్రభుత్వా వేర్లు బలంగా పాతుకుపోయాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే-పాటిల్, ఆయన శాఖ పనితీరుపై సీఎం థాక్రె అసంతృప్తిగా ఉన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సీఎం ఉద్దవ్ థాక్రె ఖండించారు. అలాంటిదేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.