కరోనా దెబ్బ ఐపీఎల్‌కు తాకింది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను, ప్రజలను వణికిస్తూ వస్తున్న ఈ మహమ్మారి భయానికి ఐపీఎల్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఓవైపు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మాత్రం ఐపీఎల్ ఉంటుందని ప్రకటించగా, పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాయి. కేంద్రం కూడా ఐపీఎల్‌పై పునరాలోచించాలని బీసీసీఐని కోరింది.
అయితే, ఇప్పటికే ఐపీఎల్‌పై మహారాష్ట్ర సర్కార్ గుర్రుగా ఉండగా, ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ను ఢిల్లీ పరిధిలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ బాటలోనే మహరాష్ట్ర సర్కార్ కూడా ఐపీఎల్‌పై నిషేధం విధించే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే ఐపీఎల్ నిర్వహించినా… క్రికెట్ స్టేడియాలకు ప్రజలను అనుమతించకుండా, కేవలం టీవీ ద్వారానే వీక్షించే ఏర్పాట్లలో ఉన్న ఐపీఎల్ సంస్థకు ఇది గట్టి ఎదురుదెబ్బగా పలువురు భావిస్తున్నారు.