ఆర్టీసీ సమ్మెతో జీతాల చెల్లింపులు నిలిపివేసిన యాజమాన్యంపై కోర్టుకెక్కిన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం వద్ద జీతాలు చెల్లించేందుకు డబ్బు లేదని, ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 7.5కోట్లు మాత్రమే ఉన్నాయని, జీతాలు చెల్లించాలంటే 224కోట్లు అవసరమవుతాయని కోర్టుకు తెలిపింది.
దీనిపై కార్మికులు మండిపడుతున్నారు. ఇదే నిజమైన కారణం అయితే… సమ్మెలో లేని వారికి మాత్రమే జీతాలు పడ్డాయని, ఉన్న వారికి జీతాలు పడలేదని దీనికి ఎం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వ్యవహరశైలిని ప్రజలే ఎండగడతారని మండిపడుతున్నారు.