ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ.. ముంబైలోని ధారవి ది గ్రేట్ అనిపించుకుంది. దేశంలో కరోనా కేసులు మొదలయ్యాక.. అత్యధిక మంది బాధితులతో ధారవి ప్రాంతం ఆందోళకు గురి చేసింది. రోజూ వేలాది కేసులు అక్కడ వెలుగుచూసేవి. అసలు ధారవిలో కరోనా కంట్రోల్ సాధ్యమేనా అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. అలాంటి ప్రాంతం.. ఇప్పుడు ఆదర్శంగా మారింది. గత 24 గంటల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇలా జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి..
జూలై 26న ధారవిలో తొలిసారి రెండు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆ తర్వాత చూస్తుండగానే భారీగా పెరిగిపోయాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం కావడంతో.. వైరస్ స్వైర విహారం చేసింది. దీంతో ఈ ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మొబైల్ దవాఖాలను ఏర్పాటు చేసింది. వందలాది ఆరోగ్య కార్యకర్తలలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఫలితంగా మిగతా ప్రాంతాల్లో కంటే కూడా ధారవిలో కరోనా కంట్రోల్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో ఏకంగా నిన్న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఎంతో ఊరట కలిగిస్తోంది.