బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు ఏపీలో విస్తరించలేదని ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాజమండ్రికి చెందిన మహిళ బ్రిటన్ నుండి వచ్చారని, ఆమెకు కొత్త స్ట్రెయిన్ ఉన్నట్లు తేలిందన్నారు. అయితే, ఆమె కొడకుతో పాటు తను సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి కూడా వైరస్ సోకలేదని.. వారికి నెగెటివ్ వచ్చిందన్నారు.
రాష్ట్రంలో కొత్త వైరస్ వ్యాపిస్తున్నట్లు గుర్తించలేదని… పరిస్థితిని నిరంతరమూ పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అపోహలను నమ్మొద్దని కోరారు.