టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది ఎవరని ప్రశ్నించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని అనలేదా.. అని నిలదీశారు.
హోల్ సేల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరలేదా.. అని రేవంత్ రెడ్డి ని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్సే కలిసి పోటీ చేయబోతున్నామని తెలిపాయన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే, బీఆర్ఎస్ కు వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారన్నారు.
దుబ్బాక,మునుగోడు, హుజురాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి ప్రజలు చూశారన్నారు ఆయన. కాంగ్రెస్ ను ఢిల్లీలో, గల్లీలో ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బీజేపీ బలంగా ఉందని.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.