చాలావరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతుంటాయి. వందలో ఐదు, పది సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. కొన్నిసార్లు ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ సాధిస్తుంటే… మరోవైపు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి. మరికొన్ని చిత్రాలు మంచి ఫీల్ గుడ్ మూవీస్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం నిరాసపరుస్తూనే ఉంటాయి. అలా నిరాశపరిచిన సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఇటీవల రిలీజ్ అయిన అంటే సుందరానికి….వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. కానీ ఓటీటీ లో మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
అలాగే విరాటపర్వం…. సాయి పల్లవి రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఓటిటిలో మాత్రం అందర్నీ ఆకట్టుకుంది.
మరో సినిమా ఖ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రిష హీరోయిన్స్ గా తెర్కెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా క్రమేనా టీవీలలో మంచి చిత్రంగా ప్రేక్షకుల ఆదరణను పొందింది.
వేదం… క్రిష్ దర్శకత్వంలో తర్కెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఇది ఒక తెలుగు సినిమా అవటం కాన్సెప్ట్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవడం వంటి కారణాలతో అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కానీ ఇది టాలీవుడ్ లో ఒక మాస్టర్ పీస్ సినిమా గానే చెప్పాలి.
మరో సినిమా అ! సైక్లాజికల్ థ్రిల్లర్ మూవీ. కొత్తదనం కనిపించే స్క్రిప్ట్ తో రూపొందిన ఈ చిత్రంను ఒక్కో ఎపిసోడ్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. దర్శకుడు తెరకెక్కించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ఉంటుంది. కానీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
నీళ్ళు ఎక్కువ తాగడం మంచిదేనా…? ఎక్కువ నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది…?
ఈ నగరానికి ఏమైంది… తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాలుగు పాత్రలు తీసుకుని తెరకెక్కిన ఈ ఫన్నీ స్టోరీ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా అంటగా కనెక్ట్ కాకపోయినా రెగ్యులర్ సినిమాలు చూసి తిరుగుతూ ఉండే ఫ్రెండ్స్ గ్యాంగ్ కు మాత్రం ఇది ఒక మంచి చిత్రం అనే చెప్పాలి.
డియర్ కామ్రేడ్… దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ప్రేమలో విఫలం కాగానే బైక్ ఎక్కి ఇంటిని వదిలేసి ఏళ్ల పాటు ట్రావెల్ చేయడం అనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇది తెలుగు సినిమాలలో ఒక కొత్త పాయింట్ అనే చెప్పాలి. కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జానీ.ఈ సినిమాలో హీరో దర్శకుడు పవన్ కళ్యాణ్. మంచి ఫోటోగ్రఫీ అద్భుతమైన విన్యాసాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. సినిమా మేకింగ్ స్టైల్ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మొక్కుబడి పూజలొద్దు.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత!
అలాగే మహేష్ బాబు వన్ నేనొక్కడినే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు సుకుమార్. కొత్త ప్రయోగంతో తర్కెక్కిన ఈ చిత్రం థియేటర్లో నిరాశపరిచింది. అలాగే రామ్ జగడం… సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. సిటీ ఆఫ్ గాడ్ లాంటి హాలీవుడ్ సినిమా తరహా కథ ఇది. ఇండియా మొత్తం మాట్లాడాల్సిన సినిమా కానీ దీనిని తెలుగు ఆడియోస్ మాత్రం ఫెయిల్ చేశారు.