ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ 30 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నారు. అలా మారితే ఆకలి కేకలు లేని (ఎవరూ ఖాళీ కడుపుతో ఉండని) దేశంగా భారత్ మారుతుందని అన్నారు.
మనం 2050 సంవత్సరానికి దాదాపు 10,000 రోజుల దూరంలో ఉన్నామని అన్నారు. ఈ కాలంలో మన ఆర్థిక వ్యవస్థకు సుమారు 25 ట్రిలియన్‌ల డాలర్లను జోడించగలమని తాను అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
ఇది మన జీడీపీకి 2.5 బిలియన్ల డాలర్లు అదనంగా జోడించినట్టు అవుతుందన్నారు. ఈ కాలంలో మనం అన్ని రకాల పేదరికాన్ని నిర్మూలించగలమని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా వృద్ధి చెందితే, ఈ 10,000 రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో స్టాక్ మార్కెట్లు సుమారు 40 ట్రిలియన్ డాలర్లను అందిస్తాయని అన్నారు.
1.4 బిలియన్ల జీవితాలను ఉద్ధరించడం అనేది స్వల్పకాలంలో మారథాన్‌గా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది స్ప్రింట్ అని అదానీ తెలిపారు.