ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగానే కాకుండా వర్తమాన సామాజిక అంశాలపై ఆమె చాలా సీరియస్‌గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ ఆమె వార్తల్లో నిలుస్తుంటారు.
తాజాగా పొలిటికల్ ఎంట్రీపై ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేశారు. దీనిపై స్పందించిన ఆమె… పొలిటికల్ ఎంట్రీపై తనకు ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. రాబోయే సినిమాల షూటింగ్ లతో తాను చాలా బిజీగా ఉన్నట్టు ఆమె తెలిపారు.
తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదన్నారు. మంచి సక్సెఫుల్ యాక్టర్ గా తనకు పేరుందన్నారు. 16 ఏండ్లనకే తాను సినీ కెరీర్‌ను ప్రారంభించానన్నారు. ఎన్నో కష్టాల తర్వాతే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. రాజకీయాల పట్ల తన ఆసక్తి తన నటనలో ప్రతిఫలిస్తుందని వివరించారు.
రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని తాను ఎప్పటికప్పుడూ మంచి సినిమాలు తీస్తుంటానని చెప్పారు. తాను ఓ దేశ భక్తురాలినన్నారు. తాను తన పనిలో చాలా బిజీగా ఉంటానన్నారు. అందువల్ల దేశానికి మంచి చేసే వారికి పార్టీతో సంబంధం లేకుండా తాను మద్దతు తెలుపుతానన్నారు.