రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన సీతారామం సినిమా హిట్టయింది. దీంతో యూనిట్ తమ ప్రచారాన్ని మరింత పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు హీరో దుల్కర్, హీరోయిన్ మృణాల్ తో తెలుగు రాష్ట్రాల్లో టూర్లు ప్లాన్ చేశారు. అయితే ఎంత చేసినా స్టార్ ఎట్రాక్షన్ మాత్రం ఈ సినిమాకు యాడ్ అవ్వడం లేదు. ఉన్న ఒక్కగానొక్క స్టార్ కూడా ప్రచారానికి రానని తెగేసి చెప్పేసింది. ఆమె మరెవరో కాదు రష్మిక.
అవును.. సీతారామం సినిమా ప్రచారానికి రాలేనని చెప్పేసింది రష్మిక. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఈ ముద్దుగుమ్మ, పోస్ట్-రిలీజ్ ప్రమోషన్స్ కు తను సిద్ధంగా లేనని తేల్చిచెప్పింది. అంతేకాదు, ఆమెతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ప్రీ-రిలీజ్ ప్రచారానికి మాత్రమే రష్మిక రావాల్సి ఉంది. ఆ మేరకు ఓసారి ప్రచారంలో తళుక్కున మెరిసింది రష్మిక. అదే టైమ్ లో కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి మమ అనిపించింది. ఇప్పుడు పూర్తిగా ఆ సినిమాకు దూరమైంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది రష్మిక. ఓవైపు రణ్ బీర్ సరసన యానిమల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే, మరోవైపు ఇంకో బాలీవుడ్ మూవీ గుడ్ బైకి డబ్బింగ్ చెప్పే పనిలో ఉంది. వీటితో పాటు మిషన్ మజ్ను కూడా ఆమె చేతిలో ఉంది. ఇటు సౌత్ విషయానికొస్తే, విజయ్ సరసన ఆమె చేస్తున్న వారసుడు సినిమా షూట్ మోడ్ లో ఉంది.
ఇంత బిజీగా ఉన్న రష్మికను మరోసారి సీతారామం వైపు తీసుకురావడం కాస్త కష్టమైన వ్యవహారమే. అయినప్పటికీ నిర్మాత స్వప్న దత్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.