లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంపై కీలక ఆదేశాలు జారీ చేశారు సీపీ అంజనీ కుమార్. ముఖ్యంగా తెలంగాణ సచివాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు 2 నెలల పాటు సభలు, సమావేశాలు రద్దు చేశారు.
సచివాలయం పరిసర ప్రాంతాల్లో నినాదాలు చేయటం, 5గురికి మించి ఒకే చోట గుమిగూడటం, ధర్నాలు, రాస్తారోకోలు చేయటంతో పాటు ర్యాలీలు, ఫ్లకార్డులు ప్రదర్శించటం రెండు నెలల పాటు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సెక్షన్ 22, 1348ఫాల్సీ హైదరాబాద్ పోలీసు చట్టం ప్రకారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.