టాలీవుడ్-బాలీవుడ్ మధ్య అతిపెద్ద సమన్వయకర్త ఎవరైనా ఉన్నారంటే అది కరణ్ జోహార్ మాత్రమే. బాలీవుడ్ లో అతడికి ఎంత పెద్ద సర్కిల్ ఉందో, టాలీవుడ్ లో కూడా అంతే సర్కిల్ ఉంది. దాదాపు టాలీవుడ్ టాప్-లేయర్ అందరితో టచ్ లో ఉంటాడు ఈ దర్శక-నిర్మాత. ఇలాంటి హై-ప్రొఫైల్ వ్యక్తి ఓ పార్టీ ఇచ్చాడంటే అందులో చాలామంది ప్రముఖులు ఉంటారు. కానీ ఆశ్చర్యంగా సమంతకు మాత్రం పిలుపురాలేదు.

నిజానికి పార్టీ ఇచ్చే టైమ్ కు ఆమె ముంబయిలోనే ఉంది. ఖుషి సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే ముంబయి వెళ్లింది సమంత. పిలిస్తే వెంటనే పార్టీలో వాలిపోయే అవకాశం ఉంది. కానీ కరణ్ జోహార్ ఆమెను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఫ్యామిలీ మేన్ సీజన్-2తో బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకుంది సమంత. కరణ్ జోహార్ తోనే ఆమె ఓ సినిమా చేయబోతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఆమెకు కరణ్ నుంచి ఆహ్వానం అందకపోవడం ఆశ్చర్యకరం.