ఏలియన్స్.. వీటి ఆనవాళ్లే లేవు. గ్రహాంతర జీవులకు సంబంధించి ఎటువంటి కదలికలు లేవు.. ఈ విషయాన్ని ఇప్పుడు వైట్ హౌస్ బల్ల గుద్ది చెబుతోంది. దీనికి కారణం అమెరికా గగనతలంపై చక్కర్లు కొడుతున్న గుర్తుతెలియని వాహనాలు.
ఈ అనుమానిత వాహనాలే ఏలియన్స్ అని అగ్రరాజ్యంలో ప్రచారం జరుగుతున్న తరుణంలో.. అసలు ఏలియన్సే లేవని ఇప్పుడు వైట్ హౌస్ తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అమెరికా గగనతలంపై మరో గుర్తుతెలియని వాహనం చక్కర్లు కొట్టింది. ఇది ఏలియన్స్ కు చెందినది అని అగ్రరాజ్యంలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని వైట్ హౌస్ కొట్టిపారేసింది.
ఇక కొన్ని వస్తువుల్ని పేల్చివేసిన ఘటనలో కొన్ని అపోహలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఆ పేల్చివేతలకు ఏలియన్స్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వైట్ హౌస్ అధికారులు. ఫిబ్రవరి 4 న చైనా స్పై బెలూన్ కూల్చివేత తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న మూడో ఘటన ఇది. దీంతో అమెరికన్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అవి ఏలియన్స్ కు చెందిన వస్తువులు కావని వైట్ హౌస్ ప్రకటించింది.