పెన్నీ లిరికల్ వీడియోలో అదరగొట్టింది సితార. తొలిసారి సెట్స్ పైకొచ్చిన ఆమె సర్కారువారి పాట సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది. తన కూతురు డాన్స్ చేసిన లిరికల్ వీడియో హిట్టవ్వడంపై మహేష్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. అయితే సితార పోర్షన్ అక్కడితో కట్ అయింది. సర్కారువారి పాట సినిమాకు సితారకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు మహేష్. చివరికి ఎండ్ టైటిల్స్ లో కూడా సితార కనిపించదని చెప్పేశాడు.
“పెన్నీ లిరికల్ వీడియోలో సితార బాగా చేసింది. రికార్డ్ వ్యూస్ వచ్చాయి. కానీ సినిమాలో ఆమె కనిపించదు. కనీసం ఎండ్ టైటిల్స్ లోనైనా పెట్టమని చాలామంది అడుగుతున్నారు. అలాంటిదేం జరగలేదు. సితారకు ఇలాంటి కొత్త ఐడియాలు ఇవ్వొద్దు దయచేసి. నన్ను ఇంటికెళ్లిన తర్వాత చావగొడుకుంది. ఎండ్ టైటిల్స్ లో పెట్టమని సతాయిస్తుంది.”
ఇలా సితారపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు మహేష్ బాబు. సితారను లిరికల్ వీడియో కోసం తీసుకోవాలనే ఆలోచన పూర్తిగా తమన్ దని చెప్పుకొచ్చిన మహేష్.. నమ్రత-తమన్ కలిసి ఆ పార్ట్ మొత్తం చూసుకున్నారని, తనకు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చాడు.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది సర్కారువారి పాట. మహేష్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది సర్కారువారి పాట.