సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనపై రాష్ట్రం అంతా ప్రభుత్వంపై మండిపడుతుంది. ప్రభుత్వం, పోలీసులు వారం రోజులుగా స్పందిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. ఘటనపై మంత్రులు కనీసం పెద్దవి విప్పలేదు. అధికారులు పట్టనట్లున్నారు. ఘటన జరిగి ఎనిమిది రోజులవుంది… ఇప్పుడు మంత్రులు రావటంతో స్థానికులంతా మండిపడుతున్నారు. గిరిజన బాలిక మాన, ప్రాణాలకు ఇదేనా సర్కార్ ఇచ్చే విలువ అని జనం ఆగ్రహంగా ఉన్నారు.
ఇంత జరుగుతున్నా మంత్రులైతే దిగి వచ్చారు కానీ సీఎం కేసీఆర్ మాత్రం పెదవి విప్పటం లేదు. ఓ గిరిజన బాలికను ఘోరంగా హత్యాచారం చేసి చంపితే సీఎంకు కనీస బాధ్యత ఉండదా అని అక్కడి స్థానికులు నిలదీస్తున్నారు. గిరిజనులపై కేసీఆర్ కు ఎందుకు ఇంత చిన్నచూపు…? హత్యాచార ఘటనను ఖండిస్తున్నా… పోలీసులు వీలైనంత త్వరగా నిందితున్ని పట్టుకోవాలని ఆదేశించారు అని ప్రెస్ నోట్ విడుదల చేసే సమయం కూడా లేదా అని మండిపడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో సీఎం ఉన్నారా… అని నిలదీస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇంత జరుగుతున్నా, సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నా కేసీఆర్ పట్టించుకోవటం లేదంటే… ఇక మారుమూల పల్లెల్లో, గిరిజన గూడెంలలో జరిగితే కేసీఆర్ పెదవి విప్పుతారా అని స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సీఎం ఉంటే ఎంత.. లేకుంటే ఎంత? కనీసం బాధిత కుటంబానికి ధైర్యం చెప్పే పెద్ద మనస్సు కూడా ఉండదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.