కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్స్ రెడీ అవుతున్నాయి. కొన్ని చివరి దశలో ఉండగా, కొన్ని వ్యాక్సిన్స్ అత్యవసర వినియోగానికి అనుమతి తీసుకుంటున్నాయి. తొలిదశలో కరోనా వారియర్స్ కు టీకా ఇవ్వనుండగా… తర్వాత ఏజ్ గ్రూప్స్ వారీగా టీకా పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
అయితే, టీకా తీసుకున్న వారు రెండు నెలల పాటు మద్యం ముట్టరాదని ప్రచారం మొదలైంది. టీకాలన్ని మానషుల్లోని రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయని, మద్యం తాగటం వల్ల వాటి పనితీరు మందగిస్తుందని రష్యా అధికారులు హెచ్చరించినట్లు సర్వత్రా ప్రచారం సాగుతుంది. రష్యాలో వినియోగిస్తున్న స్పుత్నిక్ వి కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రభావవంతం కావడానికి 42 రోజుల్లో రష్యన్లు అదనపు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందంటున్నారు.
ఇది నిజమో కాదో కానీ ఈ వార్త మాత్రం మందుబాబులకు షాక్ అనే చెప్పుకొవచ్చు.