జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుడుతున్న వేళ.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు కీలక సూచనలు చేసింది. ప్రస్తుత వ్యాక్సిన్‌ను గర్భిణీలు, బాలింతలకు వేయరాదని తెలిపింది. ఇందుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు ఒకసారి ఒక కంపెనీకి సంబంధించిన టీకా డోసు వేసుకున్నవారు.. రెండోసారి కూడా అదే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ డోసు వేసుకోవాలని వెల్లడించింది. కచ్చితంగా రెండు డోసులు ఒకే కంపెనీకి చెందినవై ఉండాలని స్పష్టం చేసింది.
మరోవైపు వ్యాక్సిన్ వేసుకున్నవారు కచ్చితంగా 14 రోజుల పాటు కరోనా నివారణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. 14 రోజుల తర్వాతే వ్యాక్సిన్ ప్రభావం మొదలవుతుందని కేంద్రం వెల్లడించింది.