ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై వివక్ష విషయంలో, మహిళల హక్కుల విషయంలో తాలిబన్లు అనుసరిస్తున్న తీరుపై యావత్ ప్రపంచం నివ్వెరపోతుంది. మహిళల చదువుల విషయంలో, మహిళలకు పాలనలో స్థానం విషయంలో ఆంక్షలు పెట్టిన తాలిబన్లు తాజాగా ఉద్యోగుల విషయంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆ దేశ మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన మహిళా ఉద్యోగులపై తాలిబన్లు నిషేధం విధించారు. పనిచేసేందుకు వచ్చిన ఉద్యోగులను అడ్డుకొని వెనక్కి పంపారు. దీనిపై ఆ ఉద్యోగులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.
మహిళలు కేవలం పిల్లలను కనడానికే అని బహిరంగంగా ప్రకటించిన తాలిబన్లు… తమ ఆంక్షలను ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతున్నారు.