హుజురాబాద్ ఉప ఎన్నికపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతతో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిరుద్యోగ యువతతో భారీగా నామినేషన్లు వేయించబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం కోఆర్డినేటర్ గా భాస్కర్ రెడ్డిని నియమించారు.
సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న షర్మిల… తాము నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని పిలుపునిచ్చారు. నామినేషన్ల ప్రక్రియ సహా అన్ని విషయాల్లోనూ అండగా ఉంటామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా ప్రభుత్వం చేస్తున్న తాత్సారంపై హుజురాబాద్ లో పెద్ద ఎత్తున పోరాటానికి రెడీ అవుతున్నట్లు ప్రకటించారు.