రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లలో ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాజకీయ పార్టీలకు బీ-ఫామ్ ల అందజేత గడువు కూడా ఈ రోజు మధ్యాహ్నంతో ముగిసింది. కరీంనగర్ లో ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలతో అక్కడ నామినేషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. కరీంనగర్ లో నామినేషన్ల ఉపసంహరణకు గుడువు ఈ నెల 16న ముగుయనుంది. పోలింగ్ ఈ నెల 25న, ఓట్ల లెక్కింపు 27న చేపడతారు. మరో వైపు మున్సిపాల్టీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఖరారైంది. పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో అత్యధికంగా 411 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.