బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు షాకిచ్చింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు. ఓ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు రాని కారణంగా దీన్ని ఇష్యూ చేసింది.
వివరాల్లోకి వెళ్తే… జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో జరిగింది. అయితే.. 2020 నవంబర్ 23న కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న టీఆర్‌ఎస్ ప్రచారానికి సంబంధించిన ఫెక్సీలను,హోర్డింగ్ లను అరవింద్, ఆయన అనుచరులు చింపివేశారని కేసీఆర్, కేటీఆర్ ను తిడుతూ దుర్భాషలాడారని ప్రస్తుత ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే అరవింద్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేసి కోర్టులో దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో సాక్షుల విచారణ పూర్తయి 313 ఎగ్జామినేషన్ కి తప్పనిసరిగా రావాలని అరవింద్ ను ఆదేశించింది కోర్టు. అయితే.. ఆయన రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.
పోలీసులు అరవింద్ ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది ప్రజాప్రతినిధుల కోర్టు. కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.