ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోర్టు షాక్ ఇచ్చింది. రెండు వేరు వేరు కేసుల్లో విచారణకు హాజరు కానందుకు ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, వరంగల్ తూర్పు ఎమ్మల్యే నన్నపనేని నరేందర్ లకు కోర్టు ఎన్ బీడబ్ల్యూ నోటీసులను జారీ చేసింది. కరీంనగర్ ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాజీపేటలో నమోదైన మరో కేసులో ఎమ్మెల్యే నరేందర్ లు విచారణకు గైర్హాజరయ్యారు.
దీనిపై కోర్టు మండిపడింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎన్ డబ్ల్యూ నోటీసులను కోర్టు పంపించింది. ఇక 2012లో ఎంఐఎం అక్బరుద్దీన్ పై నమోదైన వివాదాస్పద వ్యాఖ్యలు కేసు విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును ఈనెల 12కి కోర్టు వాయిదా వేసింది. దీంతో తుది తీర్పుపై ఆసక్తి నెలకొంది.
రసమయి బాలకిషన్ మానకొండూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర స్కాంస్కృతిక శాఖ చైర్మన్ గా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.