బాలీవుడ్ అందాల భామ.. నోరా ఫతేహి… తన అందంతో పాటు డ్యాన్స్ తోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అటు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్‌లోనూ అనేక ఐటమ్ సాంగ్స్ చేసి కుర్రకారు మనసుల్లో చోటు సంపాదించుకుంది ఈ ముద్దు గుమ్మ.
ఇప్పుడు ఈ భామ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకోబోతోంది.’దిల్‌బర్ దిల్‌బర్’ సాంగ్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన ఆమె.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టేజ్‌కు తన టాలెంట్‌ను తీసుకెళ్తోంది.
ఫిఫా వరల్డ్‌కప్ ముగింపులో నోరా ఫతేహి పెర్ఫార్మ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నోరా ఫతేహి.. నటనలో రాణిస్తూ బాలీవుడ్‌లో టాప్ డ్యాన్సర్స్‌లో ఒకరిగా పేరు సంపాదించుకుంది.
తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది ఈ భామ. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు ఐటెమ్ సాంగ్‌లు చేసింది. అదే నిజమైతే ఈ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టోర్నీలో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనున్న తొలి వ్యక్తిగా నోరా నిలుస్తుంది.
అంతేకాదు జెన్నీఫర్ లోపెజ్, షకీరా, పిట్‌బుల్‌లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ సరసన నోరా నిలవనుంది. ప్రస్తుతానికైతే ఆమె పర్ఫార్మెన్స్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు వెల్లడించకపోయినా.. ఇప్పటికే ఆమె కాంట్రాక్ట్‌పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.
గతంలో షకీరా.. ఫిఫా వరల్డ్ కప్ కోసం చేసిన ‘వాకా వాకా’ ఆల్బమ్‌ను ప్రొడ్యూస్ చేసిన ‘రెడ్‌వన్’తో కలిసే నోరా ఇప్పుడు సాంగ్‌ను చేస్తున్నట్లు సమాచారం.ఇక ఈ ఫిఫా వరల్డ్‌కప్ కోసం రూపొందిన ఆంథెమ్‌లోనూ నోరా నటించింది. దీనికి సంబంధించి గ్లింప్స్ వీడియోను నోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
అక్టోబర్ 7న ఈ ఆంథెమ్ రిలీజ్ కాబోతోంది.ఈ ఏడాది ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఖతార్‌లో జరగనుంది.మరోవైపు బాలీవుడ్‌లో ‘థ్యాంక్ గాడ్’ మూవీలో నోరా ఫతేహి ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 24న రిలీజ్ కాబోతోంది.