పాపం జనాల్ని ఎంటర్టైన్ చేయడం కోసం యాక్టర్స్ ఒళ్ళు హూనం చేసుకుంటుంటారు.ఈ విషయం మాకు తెలుసు కాని కొత్త విషయం ఏదైనా చెప్పు అని మీరు అనొచ్చు.అక్కడకే వస్తున్నా భయ్యా. టాలీవుడ్ దర్శక ధీరుడు జక్కన్న అలియాస్ ఎస్.ఎస్.రాజమౌళి గారి దరకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో మనోహరి పాటకు కాలు కదిపి మన మతులు పోగొట్టిన నోరా ఫతేహి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటూ తన డ్యాన్స్ లతో అందరినీ అలరిస్తూ ఉంటారు
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఆ వీడియోలో నోరా వ్యాప్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశానని చెబుతూ సాంగ్ కు డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు.కిచెన్ లో వంట చేస్తున్న నోరా మదర్ నోరా వేస్తున్న డ్యాన్స్ చూసి కోపంతో చెప్పును నోరా పైకి విసిరింది. ఇక అంతే దానితో నోరా అక్కడి నుండి లోపలికి పరుగు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను తెగ ఉపేస్తుంది. మరి ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.