బాలీవుడ్ యాక్టర్ నోరా ఫతేహీ కరీనా కపూర్ కు షాక్ ఇచ్చింది. ఓ చాట్ షోలో భాగంగా కరీనానుతో ముచ్చటిస్తున్న సమయంలో మీ కొడుకు పెద్దగయ్యాక నేను వాడిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. కాసేపు షాక్ లో ఉన్న కరీనా తర్వాత తేరుకొని వాడికిప్పుడు 4 ఏళ్లు….దానికి ఇంకా చాలా సమయముందని చెప్పింది. దానికి నోరా పర్లేదు నేను వెయిట్ చేస్తానని సమాధానమిచ్చింది. ఈ విషయంపై నోరాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక మీమ్స్ కూడా వచ్చాయి.
ఇక సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లిచేసుకున్న కరీనా తైమూర్ అలీఖాన్ ను జన్మనిచ్చింది. ప్రస్తుతం కడుపుతో ఉన్న కరీనా పిబ్రవరిలో మరో బిడ్డకు జన్మనివ్వనుంది.