బాలీవుడ్ బ్యూటీ నరా ఫతేహి.. డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. అంతేకాదు తను వేసుకునే ఫ్యాషన్ వేర్స్, హాట్ డ్యాన్స్, కైపెక్కించే హావాభావాలు, అందంతో ఎప్పుడూ అలరిస్తూ.. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ బ్యూటీ. అందులోనూ తన ఘాటూ అందాలను చూపించేసి బుల్లితెరను కూడా వేడెక్కిస్తోంది. తాజాగా నోరా ఓ షోకు వెళ్తూ.. స్టైలిష్ వైట్ బాడీకాన్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నోరా అందచందాలను చూసి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు.
ఇక అటు డ్యాన్స్‌లోనే కాకుండా.. సింగర్‌గానూ రాణిస్తోంది ఈ భామ. ప్రస్తుతం రెండు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. వీటి తర్వాత కూడా కొన్ని ఐటెం సాంగ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ అందాల హాట్ బ్యూటీ.
బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. ఇక, ఈ అమ్మడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇన్ స్టా గ్రామ్‌లో 30 మిలియన్ల ఫాలోవర్లు సంపాందించుకుంది ఈ భామ.