రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా! అని పెద్దల మాట. మూర్ఖుడైన రాజుంటే నరకాన్ని భూలోకంలోనే చూడొచ్చు! ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు భయానకంగా ఉంటాయి. ఇటీవల యావత్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన సంఘటన ఉత్తర కొరియాలో జరిగింది.ఇద్దరు మైనర్లు దక్షిణ కొరియా సినిమా చూసారని మరణ శిక్షవిధించారు.
ఉత్తర కొరియాలోని ర్యాన్ గాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఇద్దరు హైస్కూల్ విద్యార్థలు దక్షిణ కొరియా కే-డ్రామాస్( వెబ్ సిరీసెస్), సినిమాలు, అమెరికా టీవీ షోలు చూసి షేర్ చేయడంతోబాటు కొందరికి విక్రయించారని అధికారులు అభియోగాలు మోపడంతో కిమ్ ఈ కఠిన నిర్ణయంతీసుకున్నాడు.
ఉత్తర కొరియాలో చట్టప్రకారం ఇలాంటి కార్యక్రమాలు చూడటం షేర్ చేయడం నిషిద్ధం.వాళ్ళు చూసి మరికొంతమందిని ప్రభావితులు చేసారని మరణ శిక్ష విధించారు. ఆ ఇద్దరినీ వైమానిక క్షేత్రం వద్దబహిరంగంగా కాల్చిచంపారు. కిమ్ ద్రుష్టిలో టీనేజర్లు ఇలాంటి కార్యక్రమాలను వీక్షించడం పలువురితో పంచుకోవడం తీవ్రనేరంగా పరిగణిస్తారు.అంతేకాదు వీటిని దుష్టకార్య కలాపాలుగా భావిస్తాడు.
కాగా, వీరిద్దరికీ శిక్షవిధించేప్పుడు అందరూ తప్పని సరిగా చూడదాలని అధికారులు స్థానికులను బలవంతంగా వానిక క్షేత్రానికి తరలించారు. కేవలం సినిమాలు చూసారనే నెపంతో కిరాతకంగా చంపడం దుష్టకార్య కలాపం కాదా అని నెటిజన్లు కిమ్ ని ప్రశ్నిస్తున్నారు.