ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే ఉత్తర కొరియా తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు తన తాజా నివేదికలో కరోనావైరస్ గురించి స్పష్టంగా చెప్పింది. మా దేశంలో అసలు కరోనా వైరస్ అనేది రాలేదని స్పష్టం చెసింది. ఏడాది క్రితం అన్ని దేశాలకు చుక్కలు చూపించిన కరోనా విషయంలో ఆ దేశం చాలా సీరియస్ గా అడుగులు వేసింది. ఆ దేశంలో మహమ్మారిని కట్టడి చేయడానికి ఆ దేశ అధ్యక్షుడు కఠిన చర్యల దిశగా అడుగులు వేసారు.
సరిహద్దులను మూసివేసిన ఆ దేశం పర్యాటకులను నిషేధించింది. దౌత్యవేత్తలను కూడా తమ దేశం నుంచి పంపించంది. సరిహద్దు ట్రాఫిక్‌ను తీవ్రంగా పరిమితం చేస్తుంది. కరోనా లక్షణాలు ఉన్న 10 వేల మందిని క్వారంటైన్ చేసింది. అయితే ఇప్పటి వరకు తమ దేశంలో కరోనా వైరస్ అనేది రాలేదని చెప్తుంది ఈ దేశం. చైనాతో సరిహద్దుల్లో ఉన్నా సరే కరోనా రాలేదని చెప్పడమే వింతగా ఉంది.
మహమ్మారి మొదలైన దగ్గరి నుంచి ఏప్రిల్ 1 వరకు కరోనా వైరస్ కోసం 23,121 మందిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి ఎడ్విన్ సాల్వడార్ బుధవారం అసోసియేటెడ్ ప్రెస్‌కు పంపిన ఇమెయిల్‌లో ఈ విషయం ప్రస్తావించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 మధ్య 732 మందిని పరీక్షించినట్లు ఆ దేశం పేర్కొంది. తమ దేశ ఆటగాళ్లను రక్షించుకోవడానికి ఒలంపిక్స్ ని కూడా దూరం పెడుతున్నామని పేర్కొంది.