ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ శాడిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరేమైనా పర్వాలేదు కానీ తాను అనుకున్నది మాత్రం జరగాలని అనుకుంటాడు. తాజాగా తన ప్రసంగం కోసం ఆ దేశ ప్రజలను, అధికారులను ఎముకలు కొరికే చలిలో అరగంట నిల్చోబెట్టి వార్తల్లో నిలిచారు.
ఇటీవల తండ్రి కిమ్ జాన్- 2 80 వ జయంతి వేడుకలను సంజియాన్ నగరానికి వెలుపల కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల నిర్వహించారు. 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఓ బహిరంగ సభను అక్కడ ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడు కిమ్ రావడంతో అధికారులు, ప్రజలు రాక తప్పని పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు, అధికారులు సభకు హాజరయ్యారు. ఆ సభలో ఆయన సుమారు అరగంట పాటు ప్రసంగించారు.
ఓ వైపు ఎముకలు కొరికే చలి. మరో వైపు పెద్ద పులి లాంటి కిమ్. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీంతో అరగంట వరకు వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నట్టు పలు పత్రికలు పేర్కొన్నాయి.
కిమ్ తో పాటు వేదికపైన ఉన్న కొందరు అధికారులు తమ శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి హీటర్లను వాడినట్టు పలువురు విశ్లేషిస్తున్నారు. వేదికపైన రెడ్ కార్పెట్ కింద విద్యుత్ వైర్లు కనిపిస్తున్న ఫోటోలను వారు సాక్ష్యాలుగా చూపిస్తున్నారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కిమ్ మామ్ శాడిజం అంటే మాములుగా ఉండదు మరీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.