21వ శతాబ్దంలో దేశ అభివృద్ధికి ఇంజన్ గా ఈశాన్య భారత్ ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ…
‘ రాష్ట్రం 36 ఆవిర్బావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. 50 ఏండ్ల క్రితం నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఏజెన్సీ(నెఫా)కి అరుణాచల్ ప్రదేశ్ గా పేరు వచ్చింది” అని తెలిపారు.
‘ 21 వ శతాబ్దంలో దేశ అభివృద్దికి ఇంజన్ గా తూర్పు ఇండియా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈశాన్య భారత్ మారుతుందని ధృడంగా నమ్ముతున్నాను. ఈ స్పూర్తితో గత ఏడేండ్లలో ఎన్నడూ లేని విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు పనులు చేశాము” అని అన్నారు.
‘ దేశభక్తి భావన, సామాజిక ఐకమత్యాలను అరుణాచల్ ప్రదేశ్ అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లింది. మీరు మీ సంస్కతి, వారసత్వాన్ని కాపాడుకుంటున్న విధానం, మీ సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళుతున్న విధానం మొత్తం దేశానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తుంది” అని వెల్లడించారు.